Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ నేడే

ఓటుకు నోటు కేసును పునర్విచారణ ఆదేశాలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి.

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (09:42 IST)
ఓటుకు నోటు కేసును పునర్విచారణ ఆదేశాలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి. ఈ కేసును మరోమారు సమగ్ర నివేదిక అందించాలన్న తెలంగాణ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పిటీషన్‌ను దాఖలు చేశారు. 
 
ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో పునర్విచారణ అవసరం ఏముందని తన క్వాష్ పిటిషన్‌లో ఏసీబీ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని బాబు ప్రశ్నించారు. పునర్విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పిటిషన్ దాఖలైందని సదరు పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. 
 
ఈ పిటీషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ విచారణకు స్వీకరించారు. తదుపరి విచారణను శుక్రవారంకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే, హస్తినలో కూడా ఆసక్తి నెలకొంది. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments