Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్

Webdunia
మంగళవారం, 8 మే 2018 (09:10 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందింది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. 
 
ఆ ఆడియో టేపులో వున్న గొంతు చంద్రబాబుదేనని తేలడంతో.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కేసు విచారణలో ముందుకెళ్లండని అధికారులను కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ కేసులో జూలై 28, 2015న తొలి చార్జ్ షీట్ వేసిన ఏసీబీ, ఈ నెల చివరి వారంలో మరో చార్జ్ షీట్ వేయనున్నట్టు తెలిసింది. 
 
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని తెలుసుకున్న కేసీఆర్.. ముందుగానే గవర్నర్ నరసింహన్‌ను కలిశారని.. కేసు గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి చార్జ్ షీట్ దాఖలుకు జీఏడీ అనుమతి తీసుకోగా, గవర్నర్ కూడా అనుమతించడంతో రెండు వారాల్లోనే కోర్టు ముందు చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీబీ అధికార వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments