ప్రతి అమావాస్యకు మాపై కేసులు: దేవినేని

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:10 IST)
తిరుపతి: రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అమావాస్యకు తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనపై సీఐడీ కేసు ఎందుకు పెట్టారని ఉమ ప్రశ్నించారు.
 
‘‘తిరుపతిపై సీఎం అంతరంగాన్ని మీడియాకు చూపితే నాపై కేసులా? మార్ఫింగ్‌ చేశానని తప్పుడు కేసులు బనాయిస్తారా? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారా? తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదు. మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాలను రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. దీనిపై రాష్ట్ర హక్కులను వదిలేశారని దేవినేని ఉమ ఆరోపించారు. కృష్ణా బోర్డు పరిధిలో లేని ప్రాజెక్టులను దాని పరిధిలోకి తెచ్చారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments