Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలిని నిజంగానే మినీ సింగపూర్ చేసేస్తారేమో...? స్పీడు పెంచిన మంత్రి నాదెండ్ల

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (16:05 IST)
అలా పదవీప్రమాణం చేసారో లేదో ఇలా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తున్నారు కూటమి మంత్రులు. జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించారు. 
 
వాస్తవానికి తెనాలి పట్టణానికి మినీ సింగపూర్ అనే పేరు వుంది. ఎందుకంటే ఈ పట్టణం మధ్యగుండా కృష్ణా నది నుంచి కాలువ వెళుతుంది. ఈ కాలువకి అటువైపు ఇటువైపు రోడ్డు వుంటుంది. ఇది తెనాలి పట్టణం మధ్యగా వెళుతుంటుంది. ఐతే ఈ కాలువకు పక్కనే వున్న రోడ్డు మాత్రం అధ్వాన్నంగా వుంది. ఇదే కాదు... పట్టణంలో చాలాచోట్ల ఇరుకు సందులు, గతుకుల రోడ్లు, పాతబడిపోయిన విద్యుత్ స్తంభాలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments