Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో దొంగల ముఠా అరెస్టు : 263 గ్రాముల నగలు స్వాధీనం

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (08:51 IST)
మదనపల్లె, వాల్మీకిపురంలో తచ్చాడుతున్న దొంగల ముఠాను ప్రత్యేక ఐడీ పార్టీ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి రూ.7.2 లక్షల విలువ చేసే 263 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ విషయమై డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ గంగయ్య విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి మండలం పోడలపల్లెకు చెందిన శంకారపు వెంకటేష్ (30), కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా కఠారుముద్దలపల్లెకు చెందిన మామకుంట్ల మంజునాథ్(34), గాలివీడు మండలం బలిజపల్లె పంచాయతీ తూముకుంటకు చెందిన గంగరాజు విశ్వనాథ్ (32)లు మగ్గాలు నేసుకుంటూ బ్రతికేవారు. ఈ ముగ్గురు మరో ముగ్గురితో కలిసి ఆ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 
 
దీంతో డీఎస్పీ ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ప్రత్యేక బృందం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీ చేసిన నగలను బెంగళూరులో విక్రయించేందుకు వెళుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments