Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ఆ గేదె దొంగను పట్టేసింది... కిందపడేసి కుమ్మేసింది...

Webdunia
గురువారం, 21 మే 2015 (17:37 IST)
నెల్లూరు జిల్లాలో ఓ గేదె దొంగను పట్టేసింది. నగలు లాక్కొని పరారైన ఓ దొంగను ఓ మనిషో లేకుంటే పోలీసులో పట్టివ్వలేదు. ఈ నగల దోపిడి చేసే దుండగుడిని ఓ గేదె పట్టించింది. ఈ నెల్లూరు జిల్లా మన్నెంవారి పల్లెలో జరిగింది. గత అర్ధరాత్రి గ్రామానికి చెందిన విజయమ్మ తన కుమారుడు, కుమార్తెలతో కలసి నిద్రిస్తోంది.
 
ఒంటిగంట దాటిన తరువాత వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని బంగారం గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు. 
 
దీంతో బాధితులు పెద్దగా కేకలు వేయడంతో కంగారుపడి పరుగు లంఘించుకున్నారు. వీరిలో ఒకడిని ఇంటి ఆవరణలోని గేదె తన కొమ్ములతో పొడిచింది. గాయాలపాలైన ఆ దొంగను అప్రమత్తమైన చుట్టుపక్కల వాళ్లు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మిగతా దొంగలను పట్టుకునే పనిలోపడ్డారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments