జగన్ కాళ్లు నాకేవాళ్లకు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తారు : బుద్ధా వెంకన్న

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (11:04 IST)
లక్షలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి బెయిలుపై తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్లు నాకే ప్రతి ఒక్కరికీ సమాజంలోని ఇతరులంతా అవినీతిపరులుగానే కనిపిస్తారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ కోవలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలీయకుండా స్కిల్ స్కామ్ జరిగిందా అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కాళ్లు ఎక్కువగా నాకడం వల్ల అందరూ అవినీతిపరుల్లా కనిపించడం సహజమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్ల మేల్ మెనోపాజ్ దశకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. 
 
కనీస అవగాహన లేకుండా ఉండవల్ల మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆయన మెదడు అరికాళ్ళలోకి జారిందా అనే అనుమానం కలుగుతుందన్నారు. అపర మేధావిలా బిల్డప్ ఇవ్వొద్దని హితవు పలికారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు డబ్బులు చేరినట్టు కేసులు పెట్టిన వాళ్లు లేదా ఉండవల్లి గాని నిరూపించే దమ్ముందా అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments