Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతోనే కాదు... నీ కూతురుతోనూ సంసారం చేయాలనుంది... రూ.10 లక్షలకు ఓకే...

డబ్బుకి కక్కుర్తి పడిన ఓ తల్లి చేయరాని ఘోరం చేసేసింది. రూ. 10 లక్షలకు ఆశపడి కన్నకుమార్తెను తను అక్రమ సంబంధం నెరపుతున్న కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేసింది. 14 ఏళ్ల బాలిక లబోదిబోమన్నప్పటికీ బలవంతంగా పెళ్లి జరిపించేసింది.

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (15:15 IST)
డబ్బుకి కక్కుర్తి పడిన ఓ తల్లి చేయరాని ఘోరం చేసేసింది. రూ. 10 లక్షలకు ఆశపడి కన్నకుమార్తెను తను అక్రమ సంబంధం నెరపుతున్న కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేసింది. 14 ఏళ్ల బాలిక లబోదిబోమన్నప్పటికీ బలవంతంగా పెళ్లి జరిపించేసింది. 
 
పూర్తి వివరాలను చూస్తే... కడప జిల్లాలో గిరిజ అనే యువతికి ఇద్దరు పిల్లలున్నారు. ఐతే కడపలో చాలినంత డబ్బు చేతికి అందడం లేదని గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకుంది గిరిజ. అయితే ఆమెకు 11 ఏళ్ల కుమార్తె వుంది. దాంతో ఆ పాపను తన తల్లి వద్ద విడిచి వెళ్లిపోయింది. ఇది జరిగి 13 ఏళ్లయింది.‌
 
గల్ఫ్ లో వుద్యోగం కోసం వెళ్లిన గిరిజ అక్కడ రెడ్డెయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది ఇలా నడుస్తూ వుండగానే తన తల్లి వద్ద పెరుగుతున్న బాలిక ఇటీవలే 9వ తరగతిలో చేరింది. ఆ సందర్భంగా ఆమె తన ఫోటోలను తల్లికి పంపింది. వాటిని చూసిన రెడ్డెయ్య కన్ను ఆమెపై పడింది. మెల్లిగా తన మనసులోని కోర్కెను గిరిజతో చెప్పాడు. నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానంటూ ఆశ చూపాడు. దానికి గిరిజ సేరనంది. వెంటనే గల్ఫ్ నుంచి ఇద్దరూ ఇండియాలో వాలిపోయి కడపలో తన కుమార్తె వద్దకు వెళ్లారు. 
 
రెడ్డయ్యను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది గిరిజ. బాలిక ససేమిరా అని మొండికేసింది. దాంతో గిరిజ కుమార్తెను చిత్రహింసలకు గురి చేసి రెడ్డెయ్యతో వివాహం జరిపించేసింది. ఈ విషయం పొరుగున వున్నవారికి తెలియడంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గిరిజతోపాటు రెడ్డెయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments