Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి బారాత్‌లో 10 రౌండ్ల తుపాకీ కాల్పులు.. పోలీసుల అదుపులో పెళ్లికొడుకు

పాత బస్తీలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికుమారుడు గుర్రంపై ఊరేగుతూ పది రౌండ్ల తుపాకీ కాల్పులు జరిపి, ఇపుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (15:31 IST)
పాత బస్తీలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికుమారుడు గుర్రంపై ఊరేగుతూ పది రౌండ్ల తుపాకీ కాల్పులు జరిపి, ఇపుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, పాతబస్తీలోని షామ థియేటర్ ముందు పెళ్లి బారాత్ జరుగుతుంటే పెళ్లు కుమారుడు గుర్రంపై కూర్చుని రెండు చేతులతో రెండు పిస్టల్స్ పట్టుకుని దాదాపు 10 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటన గత నెల 22వ తేదీన జరిగింది. పెళ్లి కుమారుడు కాల్పులు జరుపుతుంటే వివాహ కార్యక్రమానికి హాజరైన బంధువులు, స్నేహితులు కేరింతల కొట్టారు. ఈ కాల్పుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఆదివారం ఉదయం నుంచి కాల్పులు జరిగిన దృశ్యాలు వివిధ టీవీ చానళ్లలో పదేపదే టెలికాస్ట్ అవుతుండగా, ఫలక్‌‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలోని నాలుగు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టి, సీసీటీవీల ఫుటేజ్‌లను పరిశీలించి బరాత్ ఎక్కడి నుంచి ఎక్కడికి సాగిందో తెలుసుకున్నారు. ఆపై మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నుంచి వరుడి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

ఒక పథకం ప్రకారం సాయిరాం శంకర్ చేసింది ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments