Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి మెడలో తాళి కడుతున్న ప్రియుడు... ప్రియుడి గొంతు కోసిన ప్రేయసి పేరెంట్స్

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (17:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
 
గురువారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ సమీపంలోని విజయపురి కాలనీకి చెందిన ప్రేమికులు మహాంకాళి అనిల్ (21), అస్తపురం మౌనికలు గత ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడంతో అమ్మాయి బంధువులు యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
 
ఇటీవలే జైలు నుంచి విడుదలైన అనిల్..  మౌనిక మైనారిటి తీరడంతో తిరిగి ఆమెను పెళ్లి చేసుకోవడానికి గురువారం ఏర్పాట్లు చేసుకున్నాడు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమజంట బుధవారం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో స్థానిక ఎల్‌ఎండీ కాలనీలోని తపాల నర్సింహస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆలయానికి చేరుకొని అనిల్‌ను తీవ్రంగా కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేసి యువతిని లాక్కెళ్లారు. అనిల్ దారుణ హత్యపై స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అతని కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments