Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

ఐవీఆర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (21:11 IST)
విజయవాడ వరద నీరు ఓ బాలుడికి ప్రాణాంతకంగా మారింది. ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ సోకడంతో అతడి కాలును తీసేసారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సెప్టెంబరు మొదటివారంలో విజయవాడ నగరం ద్వారా ప్రవహించే బుడమేరుకి వచ్చిన భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ఈ క్రమంలో ఈ వరద నీటిలో తన తల్లిదండ్రులకు సాయం చేస్తూ వుండిపోయాడు 12 ఏళ్ల భవదీప్ అనే బాలుడు. వరద నీరు తగ్గేవరకూ ఇంట్లో సామానులను భద్రంగా చూసుకుంటూ వచ్చారు.
 
ఐతే అకస్మాత్తుగా రెండ్రోజుల తర్వాత బాలుడు చలిజ్వరంతో తీవ్రంగా బాధపడటం మొదలుపెట్టాడు. వైరల్ ఫీవర్ అయి వుంటుందని ఆసుపత్రికి వెళ్లగా వైద్యుడు మందులు రాసి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఐనప్పటికీ జ్వరం తగ్గుముఖం పట్టకపోయేసరికి అతడిని నగరంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అతడికి ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ సోకినట్లు షాకింగ్ వార్త చెప్పారు. ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా బాలుడి శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి కండరాలను తినేసినట్లు చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ మరింతగా ముదరకుండా వుండేందుకు బాలుడి కుడి కాలును తొడ వరకూ శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఎడమకాలులో కూడా కొంతమేర ఈ బ్యాక్టీరియా తినేసినట్లు గుర్తించారు.
 
ఇలాంటి సమస్య మధుమేహుల్లో తలెత్తుతుందనీ, కానీ బాలుడికి ఇది ఎలా సోకిందో అంతుపట్టడంలేదు. బాలుడి శరీరం నుంచి తొలగించిన కుళ్లిన భాగాల నుంచి తీసిన వాటిని వైద్యులు టెస్ట్ చేసి చూడగా అందులో ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వన్నట్లు గుర్తించారు. వరద నీటిలో మురుగు నీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడించారు. అందువల్ల ఎవరైనా జ్వరం వచ్చి కాళ్లు వాపు వుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments