Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ బెంచ్‌పై కూర్చుని ఆడుతూ.. చిన్నారి అలా పడిపోయాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:04 IST)
వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలు సాయంత్రం పూట హాయిగా పార్కులకు చేరుకుంటున్నారు. అయితే పిల్లలు పార్కుల్లో ఆడుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు అలా వదిలేస్తుంటారు. అలాంటి వారికి ఈ ఘటన అప్రమత్తంగా వుండాలని చెప్తోంది. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే? ఇటీవల ఆడుకుంటూ రోడ్డు పక్కనే వున్న కరెంట్ స్తంభం పట్టుకుని చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా పార్కులో సిమెంట్ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ హైదర్ గూడ‌లో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ప్లే గ్రౌండ్ ఉంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నిశాంత్ శర్మ బాలుడు సిమెంట్ బెంచ్‌పై కూర్చొన్నాడు. దానిని అటూ..ఇటూ..కదుపుతున్నాడు. ఒక్కసారిగా సిమెంట్ బెంచ్ బోల్తా పడింది. దాని కింద నిశాంత్ చిక్కుకపోయాడు. వెంటనే అక్కుడున్న వారు సిమెంట్ బెంచ్‌ని పైకి లేపారు. తలకు తీవ్ర గాయం కావడంతో నిశాంత్ చనిపోయాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న నిశాంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. విరిగిపోయిన సిమెంట్ బెంచ్ ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. పార్క్ నిర్వాహణ సరిగ్గా లేదని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments