Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూసేకరణ నిలిపివేయడం చాలా సంతోషం : బొత్స సత్తిబాబు

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (10:10 IST)
భూసేకరణ నిలిపివేయడం చాలా సంతోషకరమని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర మంత్రి పి నారాయణ వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో భూసేకరణ నిలిపివేయడమనేది ప్రభుత్వం ఏర్పడిన ఈ 15 నెలల్లో చేసిన మంచి పని అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే భూసేకరణ జీవో జారీ అయిందని మంత్రి నారాయణ చెప్పడం వింతగా, విడ్డూరంగా ఉందన్నారు.
 
ఇంత అత్యవసరమైన అంశాన్ని సీఎంకు తెలియకుండా తానే చేశానని మంత్రి చెప్పడం చూస్తుంటే ఎవరు సిగ్గుపడాలో తెలియని పరిస్థితి అన్నారు. సీఎం, మంత్రుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రస్తుత టీడీపీ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నదని బొత్స మండిపడ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments