Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో జగన్.. పిల్ల చేష్టలు మానుకో.. : గాలి, బొజ్జల హితవు

Webdunia
గురువారం, 24 జులై 2014 (09:20 IST)
రైతు రుణమాఫీ అంశాన్ని అడ్డుపెట్టుకుని పిల్లలు చేష్టలు చేయడం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మానుకోవాలని టీడీపీ సీనియర్ నేతలు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు హితవు పలికారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు నరకాసుర వధ పేరుతో చంద్రబాబు దిష్టి బొమ్మల దహనానికి జగన్ పిలుపునివ్వడంపై వారు తీవ్రంగా స్పందించారు. 
 
పిల్ల చేష్టలు చేస్తే రైతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్‌కు తగిన బుద్ధిచెబుతారన్నారు. దిష్టిబొమ్మలు తగలేయండని జగన్ అనడం సరికాదని ఇలాంటి చర్యలను జగన్ మానుకోవాలని అన్నారు. రుణమాఫీ చేస్తామంటే , ఎవరూ చేయలేరని జగన్ ఆనాడు అన్నారని ఇపుడు చంద్రబాబునాయుడు చేస్తానంటే ఆయనను విమర్శిస్తున్నారని గాలి ఆరోపించారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రూ.లక్ష మాఫీ చేస్తే ఏపి సిఎం చంద్రబాబునాయుడు లక్షన్నర మాఫీ చేశారని జగన్ తెలుసుకోవాలని అన్నారు. ఇంత వెసులుబాటుగా రుణమాఫీ దేశంలో ఎక్కడా లేదని అన్నారు. రూ.16 వేల కోట్ల లోటు ఉన్నా చంద్రబాబునాయుడు 45 వేల కోట్ల రూపాయిల రుణమాఫీ చేయడం రికార్డు అని గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments