Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లి మాటెత్తితే మొహం చాటేశాడు.. మహిళ ఆత్మహత్యాయత్నం

ఫేస్‌బుక్ పరిచయంతో మూడేళ్లుగా సహజీవనం చేశారు. కానీ పెళ్లి అనగానే ముఖం చాటేశాడు. దీంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి బోడుప్పల్‌లో చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (09:07 IST)
ఫేస్‌బుక్ పరిచయంతో మూడేళ్లుగా సహజీవనం చేశారు. కానీ పెళ్లి అనగానే ముఖం చాటేశాడు. దీంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన  మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి బోడుప్పల్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌లోని ఓ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న మహిళ(30)కు గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో వివాదాల కారణంగా విడాకులు తీసుకుని గత కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. 
 
ఉప్పల్‌ డిపో సమీపంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులో పనిచేస్తూ జీవిస్తోంది. బాలానగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌తో ఆమెకు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అతడికి కూడా పెళ్లై పిల్లలున్నారు. ఫేస్‌బుక్‌ పరిచయంతో సదరు మహిళతో శ్రీనివాస్‌గౌడ్‌ సహజీనం చేస్తున్నాడు.

వివాహం చేసుకోమని కొన్ని రోజులుగా అతడిని అడిగింది. ఈ విషయం శ్రీనివాస్‌గౌడ్‌ భార్యకు తెలియడంతో బంధువులతో కలిసి బోడుప్పల్‌ వచ్చి మహిళను దుర్భాషలాడి చితకబాదారు. 
 
అవమానం భరించలేక సదరు మహిళ గురువారం ఉదయం గుర్తుతెలియని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments