Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడీపి మాకు సీట్లు కేటాయించడం ఏంటి? మేమే వారికిస్తాం అంటున్న భాజపా నేత

అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (15:31 IST)
అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉండొచ్చు కానీ.. పొత్తుతో పని అవసరం ఉండకపోవచ్చు. బిజెపిపై దేశ ప్రజల్లో ఎంతో నమ్మకం పెరిగింది. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు అవుతున్నాయని చెప్పారు. 
 
ఎపిలోనే కాదు తెలంగాణా రాష్ట్రంలోను అధికారం మాదే. వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండాను ఎగురవేస్తాం అని చెప్పారు బిజెపి నేత సోము వీర్రాజు. బిజెపిలో ఉన్న సోము వీర్రాజు ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటే ఫర్వాలేదు గానీ పొత్తు పెట్టుకున్న టిడిపిని చాలా హీనంగా మాట్లాడటమే ఇప్పుడు టిడిపి నేతలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 
 
టిడిపి నేతలు మాకు సీట్లు కేటాయించడం ఏమిటి. మేము వారికి సీట్లు కేటాయిస్తాం. మేము చెప్పిన చోటికే వారు వెళ్ళాలి. ఇలా సోము వీర్రాజు మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. మరి సిఎం ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారుతోంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments