Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సీన్లోకి వచ్చిన విష్ణుకుమార్.. జగన్‌తో ప్రత్యేక భేటీ ఎందుకు?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (09:26 IST)
బీజేపీ నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ మళ్లీ సీన్లోకి వచ్చారు. వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విష్ణుకుమార్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్ చాంబర్‌లో జరిగిన ఈ భేటీలో ప్రత్యేక హోదాపై చర్చలో మాట్లాడేందుకు సర్కారు అవకాశమిస్తుందని విపక్ష నేతకు ఆయన సూచించారు. అయితే ఇప్పటికే ఒంటి గంట దాటిపోయిందని, ఇక తనకెప్పుడు మాట్లాడే అవకాశమిస్తారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
 
తాను అధికార పక్షంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చిన విష్ణుకుమార్, నేరుగా అధికార పక్షం వద్దకెళ్లారు. ప్రతిపక్ష నేత వాదనను టీడీపీ నేతల ముందు పెట్టారు. వారు కూడా విష్ణుకుమార్ రాజు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని జగన్‌కు చేరవేసిన విష్ణకుమార్ రాజు పరిస్థితిని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాతే సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై చర్చను ప్రారంభించారు. 
 
కాగా విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో రాయబారాలు నడుపుతూ కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే మునుపటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో ఆయన అధికార పక్షాన్ని ఒప్పించిన సంగతి తెలిసిందే. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments