Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా ప్రైవేట్ బిల్లుపై బీజేపీ 'దొంగాట'... ఓటింగ్ పెట్టకుండా తప్పించుకుంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే విషయంపై భారతీయ జనతా పార్టీ వైఖరి తేటతెల్లమైంది. కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై బీజేపీ దొంగాట ఆడింద

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (18:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే విషయంపై భారతీయ జనతా పార్టీ వైఖరి తేటతెల్లమైంది. కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై బీజేపీ దొంగాట ఆడింది. ఈ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగకుండా అడ్డుకుంది. తద్వారా ప్రస్తుతానికి బీజేపీ గట్టెక్కింది. 
 
కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తూ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటూ పలు అభ్యంతరాలను లేవనెత్తారు. వాటి ప్రాతిపదికన లోక్‌సభ స్పీకర్‌ పరిశీలనార్థం బిల్లును పంపుతున్నట్టు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రూలింగ్ ఇచ్చారు. బిల్లుపై ఇప్పుడు ఓటింగ్ పెట్టాలని కోరుతున్న సభ్యులను వారిస్తూ, బిల్లుపై చర్చ ముగిసిందని, ఆర్థిక మంత్రి లేవనెత్తిన అభ్యంతరాలను తీర్చిన తర్వాతనే ముందుకు వెళ్లగలుగుతానని వెల్లడించారు. 
 
ఒక బిల్లు మనీ బిల్లు అవుతుందా? కాదా? అన్న విషయాన్ని తేల్చే హక్కు తనకు లేకపోయిందని, ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్‌దే తుది నిర్ణయమని రాజ్యాంగ నిబంధనలను ఉటంకించారు. సభ్యులకు అనుమానాలు ఉన్నాయని, తనకూ అనుమానం ఉందని స్పష్టం చేసిన ఆయన బిల్లును లోక్‌సభకు పంపుతున్నట్టు తెలిపారు. తుది నిర్ణయాధికారం స్పీకర్ దేనని స్పష్టం చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments