Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మంత్రివర్గంలోకి లోకేశ్, అఖిలప్రియ.. మంత్రులుగా పిన్నవయస్కులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలు చేరనున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో చంద్రబాబు ముహుర్తం నిర్ణయించినట్టు సమాచారం.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలు చేరనున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో చంద్రబాబు ముహుర్తం నిర్ణయించినట్టు సమాచారం. ఇది వాస్తవ రూపం దాల్చితే వారిద్దరు రికార్డు సృష్టించినట్టే. 
 
ఏప్రిల్‌లో జరిగే ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో వీరికి చోటుదక్కనుంది. అదే జరిగితే ఏపీ కేబినెట్‌లో అత్యంత పిన్నవయసు మంత్రులు వీరే అవుతారు. వీరిలో లోకేశ్ కన్నా అఖిలప్రియ వయసు ఇంకా తక్కువ. అంతేకాదు లోకేశ్ కంటే కూడా ఆమె సీనియర్ కూడా. లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, అఖిల 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు. 
 
తండ్రి నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలపై అఖిలప్రియ పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఇటీవల తండ్రి ఆకస్మిక మరణంతో తన నియోజకవర్గంతోపాటు తండ్రి నియోజకవర్గమైన నంద్యాలలో కూడా పార్టీ మంచి, చెడులను చూసుకోవాల్సిన భారం ఆమెపై పడింది. దీంతో ఆమె మానసికంగా సిద్ధమయ్యారు. అఖిలప్రియ మానసిక స్థైర్యం చంద్రబాబును సైతం ఆకట్టుకుంది.
 
అంతేకాదు ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగంగా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. భూమాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావించారని, ఆయన లేకపోవడంతో ఇప్పుడు అఖిలప్రియకు ఆ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని సీనియర్ నేతలు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments