Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా.. మీరంటే ఎనలేని గౌరవం... తుదిశ్వాస వరకు మీ వెంటే ఉంటా.. చంద్రబాబుతో నాగిరెడ్డి చివరి మాటలు

నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి హఠాన్మరణానికి ఒక్కరోజు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 36 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను బాబుకు పరిచయం చేశారు.

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (09:31 IST)
నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి హఠాన్మరణానికి ఒక్కరోజు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 36 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను బాబుకు పరిచయం చేశారు. వీరంతా ఈనెల 17వ తేదీన జరుగనున్న జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణ రెడ్డిని గెలిపిస్తారంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారందరితో కలిసి గ్రూపు ఫోట్ దిగారు. పిమ్మట.. చంద్రబాబుతో ఏకాంతంగా గంటకుపైగా చర్చలు జరిపారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబుతో నాగిరెడ్డి మాట్లాడుతూ... 'అన్నా.. మీరంటే మాకు ఎనలేని గౌరవం. మేం ఏ సమస్య తీసుకొని వచ్చినా తక్షణమే స్పందిస్తారు. అడిగిన వెంటనే నంద్యాలలో 3 వేల మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేశారు. అభివృద్ధి కోసం రూ.కోట్ల నిధులు కేటాయించారు. మాకు ఎన్నో చేసిన మీకు నేను, మా కార్యకర్తలు రుణపడి ఉంటాం. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా.. మీ ఆదేశాల మేరకు మా కార్యకర్తలంతా ఏకతాటిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డిని ఊహించని మెజారిటీతో గెలిపిస్తార'ని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజక వర్గాల అభివృద్ధిపైనే చర్చించారని తెలిసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments