భార‌త్ బంద్... కార్మిక స‌మ్మె విజ‌య‌వాడ‌లో విజ‌య‌వంతం

విజ‌య‌వాడ ‌: దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మె విజ‌య‌వాడ‌లో విజ‌య‌వంతం అయింది. బ్యాంకులు, ప్రజా రవాణా, టెలికం వంటి అత్యవసర సేవలు బంద్ అయ్యాయి. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 18 కోట్లకు పైగా కార్మికులు మద్దతు తెలుపుతున్నారు. ప‌ది కార్మిక సం

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (14:21 IST)
విజ‌య‌వాడ ‌: దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మె విజ‌య‌వాడ‌లో విజ‌య‌వంతం అయింది. బ్యాంకులు, ప్రజా రవాణా, టెలికం వంటి అత్యవసర సేవలు బంద్ అయ్యాయి. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 18 కోట్లకు పైగా కార్మికులు మద్దతు తెలుపుతున్నారు. ప‌ది కార్మిక సంఘాల నేతలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఏపీబీజేఏ, ఏపీ డ‌బ్ల్యూజే ఎఫ్ జ‌ర్న‌లిస్ట్ సంఘాలు కూడా ఈ బంద్ నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నాయి. జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను ఖండించాయి. 
 
దేశ‌వ్యాప్తంగా రవాణా, ఆర్థిక, విద్యుత, బొగ్గు, జౌళి, ఆటోమొబైల్‌, స్టీల్‌, ఆయిల్‌, రక్షణ ఉత్పత్తులు, విద్యారంగాలపై సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బ్యాంకు, ఇన్సూరెన్స్‌ యూనియన్లు సమ్మెలో పాల్గొంటామని ప్రకటించాయి. కోల్‌ ఇండియా, గేయిల్‌, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్‌, హెచ్‌ఏఎల్‌, భెల్‌ వంటి సంస్థలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. అయితే, ఎమర్జెన్సీ సర్వీసులకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. 
 
12 డిమాండ్లతో సమ్మెకు దిగుతున్న కార్మికులు ప్రధానంగా కనీస వేతనాలు రూ.18 వేలకు పెంచాలని, అధిక ధరలను నియంత్రించాలని, కనీస పెన్షన్‌ నెలకు రూ.3 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మెకు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ దూరంగా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments