Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిచ్చగాడు' వేషంలో వచ్చాడు.. బ్యాగులో నుంచి రూ.50 లక్షల నోట్ల కట్టలు తీశాడు...

బిచ్చగాడు వేషంలో బ్యాంకుకు వచ్చిన ఓ వ్యక్తి బ్యాగులో నుంచి రూ.50 లక్షల నోట్ల కట్టలు బయటకు తీయడంతో బ్యాంకు అధికారులతో పాటు.. వరుస క్రమంలో నిల్చొనివున్న ఖాతాదారులు సైతం నోరెళ్లబెట్టారు. తెలంగాణ రాష్ట్రం

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (09:01 IST)
బిచ్చగాడు వేషంలో బ్యాంకుకు వచ్చిన ఓ వ్యక్తి బ్యాగులో నుంచి రూ.50 లక్షల నోట్ల కట్టలు బయటకు తీయడంతో బ్యాంకు అధికారులతో పాటు.. వరుస క్రమంలో నిల్చొనివున్న ఖాతాదారులు సైతం నోరెళ్లబెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో ఇది జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రూ.500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో చాలా మంది పనులు మానుకుని బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్‌లోని ఓ బ్యాంకు ముందు కూడా చాలా మంది క్యూకట్టారు. ఇంతలో ఓ బిచ్చగాడు సంచితో వచ్చి క్యూలైన్‌లో నిలబడ్డాడు. అతని వేషధారణ చూసిన చాలా మంది అతనిని చీదరించుకోవడమే కాకుండా, దూరంగా జరిగిపోవాలంటూ కసురుకున్నారు కూడా. 
 
కానీ, ఈ బిచ్చగాడు మాత్రం ఏం పట్టించుకోకుండా క్యూలో నిల్చొన్నాడు. అప్పటికి క్యూ మరింత పెరిగిపోయింది. ఇంతలో అతనిని బ్యాంకు ఉద్యోగి ఎంత జమచేస్తున్నావంటూ ప్రశ్నించాడు. అంతే.. అక్కడున్న వారికి దిమ్మతిరిగేలా తన బ్యాగులోంచి 50,00,000 రూపాయల నోట్ల కట్టలు తీసి బయటపెట్టాడు. ఇంత మొత్తం జమ చేయాలంటే పాన్ కార్డు కావాలని వారు సూచించడంతో నెమ్మదిగా జేబులోంచి పాన్ కార్డు తీసి చూపించాడు. 
 
దీంతో బ్యాంకు అధికారికి మతిపోయింది. అయినా నమ్మకం కుదరని బ్యాంకు సిబ్బంది, ఇంత డబ్బు ఎక్కడిది? అని నిలదీశారు. రెండు నెలల క్రితం తన రెండెకరాల పొలం అమ్మగా వచ్చిన డబ్బని అతను సమాధానం ఇచ్చాడు. దీంతో ఆధారాలు చూపించాలని వారు అతనిని కోరడంతో తీసుకొస్తానంటూ అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బ్యాంకు అధికారులే కాకుండా, క్యూలైన్లో నిల్చున్న వారు కూడా కాసేపు షాక్‌కు గురయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments