Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం ఏమైనా నీ అబ్బ జాగీరా? నాని.. ఏంది నీ భాష : బీద రవిచంద్ర

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (14:50 IST)
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏమానా నీ అబ్బ జాగీరా... నాని.. ఏంది నీ భాష అంటూ మండిపడ్డారు. 150 సీట్లు వస్తే.. రాష్ట్రాన్ని ఏమైనా మీకు రాసిచ్చారా? ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? అంటూ ఆయన విరుచుకుపడ్డారు. 
 
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నెల్లూరులోని ఎన్‌టీఆర్‌ భవన్‌లో జరిగింది. మాజీ మేయర్‌ షేక్‌ అబ్బుల్‌ అజీజ్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బీద ముఖ్య అతిథిగా మాట్లాడారు. మంత్రులు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని ఆక్షేపించారు. కొడాలి నాని చంద్రబాబుపై మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. మా ఇష్టం మేము ఏమి చెయ్యాలో అదే చేస్తాం.. అన్న రీతిలో వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. తిరుమల ఆలయానికి ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయని ఎంతటి వారైనా వాటిని పాటించాల్సిదేనన్నారు.
 
రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, కార్మికుల నుంచి ఎదురవుతున్న తిరుగుబాటును పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలకు తెరతీసిందని ఆయన మండిపడ్డారు. జూనియర్‌ ఎన్‌టీఆర్‌ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ సరికొత్త డ్రామా యాక్టర్‌గా అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. 2014, 2019 ఎన్నికలలో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ప్రచారం చేయలేదని.. అయితే వంశీ ఎందుకు పోటీ చేశారో ప్రజలకు చెప్పాలని రవిచంద్ర డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments