Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయి ఎందుకయ్యాడు? శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నం?

శిరీష ఆత్మహత్య కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయిగా ఎందుకయ్యాడనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. శిరీషకు రాజీవ్‌తో అక్రమ సంబంధం ఉందని చెప్తున్న పోలీసులు.. రాజీవ్ తీసుకెళ్లడంతోనే వెళ్ళిందని పోలీసులు చెప్పారు.

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (15:26 IST)
శిరీష ఆత్మహత్య కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయిగా ఎందుకయ్యాడనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. శిరీషకు రాజీవ్‌తో అక్రమ సంబంధం ఉందని చెప్తున్న పోలీసులు.. రాజీవ్ తీసుకెళ్లడంతోనే వెళ్ళిందని అంటున్నారు. అయితే కారులో రాజీవ్ ఆమెపై ఎందుకు దాడి చేశాడు. కారు దిగిపారిపోయే ప్రయత్నం చేసిన శిరీషను జుట్టు పట్టుకుని పట్టుకొచ్చింది రాజీవేనని చెబుతున్న పోలీసులు...ఏ1గా శ్రావణ్‌ను ఎందుకు చేర్చారనే దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకా శ్రావణ్‌కు రాజకీయ నేతలతో పరిచయం ఉందని.. ఆ ధైర్యంతోనే అతడు శిరీష పట్ల ఓవరాక్షన్ చేశాడని సమాచారం. 
 
అలాగే శిరీషపై అత్యాచారయత్నం మాత్రమే జరిగితే...శిరీషను రాజీవ్ కారులో ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అసలు కుక్కునూరుపల్లిలో జరిగింది అత్యాచారమా? లేక అత్యాచారయత్నమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
 
శిరీషను తీసుకెళ్లిన రాజీవ్, శ్రావణ్‌లు ఆమెను కేవలం చర్చలకే తీసుకెళ్లారా? లేక ఎస్సైతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం చేసుకుని తీసుకెళ్లారా? అనే దానిపై అనుమానాలు తలెత్తాయి. సెటిల్‌మెంట్‌ కోసం తీసుకెళ్లిన శిరీషపై ఎస్సై ఎందుకు అత్యాచారయత్నం చేయాల్సి వచ్చింది అంటూ పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆరు అడుగుల పొడవు, 80 కేజీల బరువున్న శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకోవడం సాధ్యమా? అంటూ వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments