Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాగ్రత్తగా వుండండి: కృష్ణా, గుంటూరు కలెక్టర్లకు జగన్‌ హెచ్చరిక

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (12:28 IST)
కృష్ణానదిలోకి భారీగా వరదజలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈమేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడనుంచి ప్రజలను ఖాళీచేయించాలన్నారు.

ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆమేరకు చర్యలు చేపట్టాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

వారికి ఆహారం, మందులు, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments