సంక్రాంతి సంబరాలలో నారావారి పల్లెలో పాల్గొన్నారు టీడీపీ నేతలు. ఇటీవల సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగిమంటలో వేసి వినూత్నంగా నిరసనలు తెలిపారు. సీఎం జగన్ పాలన చూస్తుంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించినట్లు ఉందన్నారు. దీనిపై మంత్రి రోజా ఫైర్ అయ్యింది.
బాలకృష్ణకి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చెప్పడం మాత్రమే తెలుసునని రోజా చెప్పుకొచ్చింది. అన్ స్టాపబుల్ షో కి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే .. వీరసింహారెడ్డి సినిమాకి స్క్రిప్ట్ మరొకరు రాసిచ్చారు.
జీవో నెంబర్-1లో అసలు ఏముందో బాలకృష్ణ చదివారా.. చదివి ఉంటే ఆయన ఈ విధంగా మాట్లాడేవారు కారు.. ఏదో బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడేశారని తెలిపారు.