Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే.. : బాబు మోహన్

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (16:40 IST)
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైతే రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. బుధవారం విశాఖపట్టణంలో బాబు మోహన్ విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పి బీజేపీ తనను మోసం చేసిందని చెప్పారు. అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యాయని చెప్పారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. ఆయన ఆహ్వానం మేరకే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్టు చెప్పారు. వైజాగ్ ఎంపీ‌గా కేఏ పాల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎంపికైతే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఆయన ఎంపీ అయితే, ఇతర దేశాల నుంచి విరాళాలు తెచ్చి రాష్ట్ర దేశ అప్పులు తీర్చుతారని చెప్పారు. పైగా, ఆయన దేవుని దూత అని చెప్పాు. అందువల్ల కేఏ పాల్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments