Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలనచిత్ర రికార్డులను చెరపనున్న బాహుబలి-2: తొలి రోజు, తొలి ఆట ప్రివ్యూ.. మూగవోయిన ప్రేక్షకులు

బాహుబలి-2 తప్ప మరొక టాపిక్‌కి ఇప్పుడు తావు లేదు. హైదరాబాద్ వంటి మహానగరంలో బాహుబలి-2 సినిమా టిక్కెట్ల కోసం థియేటర్లముందు కిలోమీటర్లు (స్పష్టంగా చెప్పాలంటే 3 కి.మీ. పైగా) దూరం క్యూలలో నిల్చోవడం కనీ వినీ ఎరుగని రికార్డు.

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (04:47 IST)
టిక్కెట్లు ఉన్నాయా బాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఇదే. రాజమౌళి ఎపిక్ డ్రామా బాహుబలి-2 కొన్ని గంటలముందే (గురువారం రాత్రి 10 గంటలకు) ఏపీ తెలంగాణల్లో విడుదలైపోయింది. ప్రజలు, మీడియా, చిత్ర పరిశ్రమ ఆందరూ ఇప్పుడు ఈ ఒక్క సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి-2 తప్ప మరొక టాపిక్‌కి ఇప్పుడు తావు లేదు. హైదరాబాద్ వంటి మహానగరంలో బాహుబలి-2 సినిమా టిక్కెట్ల కోసం థియేటర్లముందు కిలోమీటర్లు (స్పష్టంగా చెప్పాలంటే 3 కి.మీ. పైగా) దూరం క్యూలలో నిల్చోవడం కనీ వినీ ఎరుగని రికార్డు. తమకు టిక్కెట్లివ్వాలంటే తమకు ఇవ్వాలంటూ ఒత్తిడి పలు వర్గాల నుంచి ఎక్కువైపోవడంతో పంపణీదారులు, ఎగ్జిబిటర్లు చివరకు తమ ఫోన్లను స్విచాఫ్ చేశారంటే బాహుబలి-2 ఎం ఉన్మాదాన్ని, పిచ్చిని జనాల్లో కలిగిస్తోదో ఎవరైనా అర్థ చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను చెరిపివేయడం ఖాయం. తెలుగు రాష్టాల్లో అదనపు థియేటర్లు, తెరలపై సినిమా ప్రదర్శనకు భారీ డిమాండ్ ఏర్పడింది.
 
తొలిరోజు, తొలి ఆట (ఏప్రిల్ 28 కాదు 27 రాత్రి) సినిమా తెరపై కనిపించగానే ప్రేక్షకలు ఈలలు, అరుపులు, కేకలు, హర్షధ్వానాలు మహాసముద్రం పొలికేక పెట్టిన దృశ్యాన్ని తలపించింది. థియేటర్లో సినిమా సాగిన విధం చూద్దాం.
 
బాహుబలి సినిమా తెరపై పడగానే ఒక ప్రాణం టైటిల్ సాంగ్ నడుస్తుంది శివగామి (రమ్యకృష్ణ) తన తలపై అగ్నకుండాన్ని పెట్టుకుని మరొక చోటికి వెళుతూ ఉంటుంది. ఆ ప్రయాణంలో తన చివరి గమ్యం చేరుకునేంత వరకు ఆమె ఎక్కడూ ఆగకూడదు. కానీ మార్గమధ్యంలోనే ఆమెకు అడ్డంకి ఎదురైంది. ఈలోగా అమరేంద్ర బాహుబలి వచ్చి ఆ అవరోధాన్ని తొలగిస్తాడు. తర్వాత సాహోరె బాహుబలి పాట. సినిమా స్మూత్‌గా నడుస్తుంటుంది. సాహోరె పాటలో బాహుబలి తొలి భాగం దృశ్యాలు కూడా కనిపిస్తాయి. 
 
కట్టప్ప, భల్లాల దేవ, బిజ్జల దేవ ఒక అద్బుతమైన దృశ్యంతో తెరముందు కనబడతారు. పట్టాభిషేకం జరగడానికి ముందు దేశాటన చేసి రావలసిందిగా బాహుబలిని రాజమాత శివగామి సూచిస్తుంది. ఆ ప్రకారం బాహుబలి, కట్టప్ప ఇద్దరూ మాహిష్మతి రాజ్యంలో పర్యటిస్తుంటారు. ఇక్కడే దేవసేన (అనుష్క) పరిచయం. ఆమె యుద్ధకళల్లో ఆరితేరిన యువరాణి. ఆమెను చూసిన బాహుబలి తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఇక్కడ కాస్సేపు హాస్య సన్నివేశాలు సాగుతాయి. దేవసేన బావ సుబ్బరాజు హాస్యం పండిస్తుంచాడు. సుబ్బరాజు అలియాస్ కుమారవర్మను పండి వీరుడిలా ప్రకటిస్తారు. ఇక్కడ మూవీ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఇక్కడే మురిపాల ముకుందా పాట వస్తుంది.
 
ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. బాహుబలి దేవసేన ప్రేమలో పడతాడని భల్లాల దేవుడికి తెలుస్తుంది. అప్పుడు అతడు శివగామిని కలిసి దేవసేనను తాను ప్రేమిస్తున్నట్లు చెబుతాడు. బాహుబలి అప్పటికే దేవసేనను ప్రేమిస్తున్నట్లు తెలియని రాజమాత తన కుమారుడు భల్లాల దేవుడితో వివాహ బంధాన్ని ఆమోదించాల్సిందిగా దేవసేనకు శ్రీముఖం పంపుతుంది. కానీ ఆమె పంపిన పద్ధతి నచ్చని దేవసేన ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. దేవసేన తిరస్కృతితో పరాభవం జరిగినట్లు భావించిన శివగామి దేవసేనకు చెందిన కుంతల రాజ్యంపై దాడి చేయవలసిందిగా బాహుబలికి సందేశం పంపుతుంది. కాస్సేపు కథ నడిచాక, ప్రభాస్‌కు పిండారీలకు మధ్య భారీ యాక్షన్ దృశ్యాలు నడుస్తాయి. దేవసేన, ప్రభాస్ బాణాలు సంధించడం హైలైట్.  ప్రభాస్ ఇక్కడ దున్నపోతును పడగొట్టే దృశ్యం అద్భుతం. 
 
తర్వాత హంసనావ పాట వస్తుంది. నిజంగానే ఈ పాట ఒక విజువల్ ఫీట్. తెలుగులో చెప్పాలంటే కనువిందు. 
 
శివగామి నిర్ణయాన్ని బాహుబలి తప్పుపడతాడు. దాంతో ఆమె కోపోద్రిక్తురాలై భల్లాలదేవుడిని రాజుగా ప్రకటిస్తుంది. బాహుబలి ఆమె నిర్ణయాన్ని ఆమోదిస్తాడు. ఇప్పుడు భల్లాలుడు మాహ్మిష్మతి రాజు అవుతాడు. బాహుబలి సైన్యాధిపతి అవుతాడు. 
 
దీంతో ఇంటర్వెల్ పడుతుంది.
ఇంటర్వెల్ తర్వాత బాహుబలిని చంపేస్తానని భల్లాల దేవుడు ప్రతిజ్ఞ చేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. దేవసేన బాహుబలిని పెళ్లాడుతుంది.ఆమె ఇప్పుడు గర్భవతి. శివగామి అనుసరిస్తున్న పద్దతులను దేవసేన ప్రశ్నిస్తుంది. దాంతో ఇద్దరికీ ఆంతరం మరింత పెరుగుతుంది. భల్లాల దేవుడిని గద్దె దింపడానకి బాహుబలి కుట్ర పన్నుతున్నాడని శివగామి అనుమానపడుతుంది. దాంతో మాహిష్మతి రాజ్యంలోని అడుగు పెట్టకుండా బాహుబలిని ఆమె వెలి వేస్తుంది. ఇక్కడే అత్యంత భావోద్వేగంతో కూడిన దృశ్యాలు సాగుతాయి. కధ స్పీడుగా నడుస్తుంది. 
 
దేవసేన, బాహుబలి ఇప్పుడు సామాన్యులతో కలిసి జీవిస్తుంటారు. ఈలోగా తనను చంపడానికి కుమారస్వామిని బాహుబలి పంపించాడని భల్లాల దేవుడు రాజమాత శివగామితో చెబుతాడు. 
 
ఇక్కడే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. అత్యంత భావోద్వేగంతో కూడిన దృశ్యాలు ఇక్కడ  కొనసాగుతాయి. 
 
ఇప్పుడు కథ మళ్లీ శివుడి వద్దకు వెనక్కు వస్తుంది. తన తండ్రి బాహుబలి ఎందుకు చంపబడ్డాడో, తన తల్లిని ఎందుకు నిర్బంధించారో శివుడికి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. భల్లాలుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి శివుడు సిద్ధమవుతాడు. ఇప్పడు శివుడే మహేంద్ర బాహుబలి. 
 
సినిమా అంతిమ యుద్ధం వైపు సాగుతుంది. మహేంద్ర బాహుబలి, భల్లాల దేవుడి మధ్య భీకర యుద్ధం సాగుతుంది. భల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి చేతిలో వధింపబడతాడు. 
 
ఇదీ బాహుబలి 2 కథ.
 
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక్క సినిమాకే సమయం కేటాయించే సాహసం చేసిన ప్రభాస్ తన నమ్మకం తప్పు కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా 
 
తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాకోసం ప్రభాస్ పడిన కష్టం చూపించిన డెడికేషన్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది.
 
తన వయసుకు అనుభవానికి మించిన పాత్రను తలకెత్తుకున్న రానా.. మరోసారి విలక్షణ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్లు మోత మొగిపోతున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన 
 
రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్‌తో రమ్యకృష్ణ నటన సినిమా స్థాయిని పెంచింది. 
 
తొలి భాగాంతంలో కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైన అనుష్క, రెండో భాగంలో కీలక పాత్రలో ఆకట్టుకుంది. బాహుబలి ప్రియురాలిగా అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది. కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్, ఇతన నటీనటులు తమ తమ పాత్రల్లో 
 
ఒదిగిపోయారు.
 
ఒక ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఐదేళ్లపాటు తపస్సు చేసిన రాజమౌళి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. బాహుబలి తొలి భాగంలో వినిపించిన విమర్శలన్నింటికీ సీక్వల్‌తో సమాధానమిచ్చాడు. 
హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహిష్మతి రాజ్యం, పాటు యుద్ధ సన్నివేశాల్లో ఏది గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేశారో.. ఏది రియల్‌తో షూట్ చేశారో అర్ధం కానంత నేచురల్‌గా ఉన్నాయి గ్రాఫిక్స్.
 
కీరవాణి నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను క్యారీ చేయటంతో పాటు కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అంతర్జాతీయ స్థాయిలో ఉంది. రాజమౌళి ఊహను తెర మీదకు తీసుకొచ్చేందుకు సెంథిల్ ఎన్నో ప్రయోగాలు 
 
చేశాడు. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా, లావిష్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
 
ఈ చిత్ర విజయం గురించి ఎవరికైనా అనుమానాలు ఉంటే ఏప్రిల్ 27 తర్వాత వాటిని మర్చిపోవచ్చు. 
 
చివరగా.. ఒక్కమాటలో బాహుబలి గురించి చెప్పుకుందాం. సాహోరె బాహుబలి. రాజమౌళి అండ్ హిస్ ఎంటైర్ టీమ్.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం