Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేతలకు భయం పట్టుకుంది:అయ్యన్న పాత్రుడు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (06:55 IST)
తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగిపోతుందనే అక్కసుతోనే వైసీపీ దాడులు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనన్నారు. తానేమి బూతులు మాట్లాడలేదని చెప్పారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గుంటూరు జిల్లాకు వెళితే ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతం పలికారని, ఇలా ఉంటుందని  ఊహించలేదన్నారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. దీంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడనని స్పష్టం చేశారు. 
 
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని, అది బలవంతంగా ఇచ్చారనేది ఆ స్టేట్ మెంట్ చూస్తే అర్థమవుతుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. రెండు నెలల్లో ఆయన మంత్రి పదవి పోయేలా ఉందని, మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు.

రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు. పార్టీ కోసం, ప్రభుత్వం చేస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మాట్లాడతామని, అధికారపార్టీ ఏం చేసినా భయపడేది లేదని అయ్యన్న స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments