Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయేషా రేప్, మర్డర్ చేసింది ఎవడో? సత్యం బాబు జీవితం నాశనమైంది... పోలీసులు బాగు చేస్తారా?

2007లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఆయేషాపై అత్యాచారం, ఆపై హత్య. ఈ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. బీ ఫార్సీ విద్యార్థిని ఆయేషా కేసులో నిందితుడుగా వున్న సత్యంబాబును నిర్దోషి అంటూ తేల్చింది. అతడే హంతకుడు అని చూపేందుకు ఎలాంటి ఆధారాలు లేక

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (14:25 IST)
2007లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఆయేషాపై అత్యాచారం, ఆపై హత్య. ఈ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. బీ ఫార్సీ విద్యార్థిని ఆయేషా కేసులో నిందితుడుగా వున్న సత్యంబాబును నిర్దోషి అంటూ తేల్చింది. అతడే హంతకుడు అని చూపేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా అతడిని 8 ఏళ్లపాటు జైల్లో పెట్టారంటూ పోలీసులను మందలించిన కోర్టు, అతడికి పరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలనీ, అప్పటి పోలీసు అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఆయేషా హత్య అనంతరం విజయవాడలో సత్యంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అతడే నిందితుడని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన సెషన్స్ కోర్టు అప్పట్లో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐతే ఆయేషా తల్లి మాత్రం సత్యంబాబు నిర్దోషి అనీ, అసలు దోషులను పట్టుకోకుండా అమాయకుడిని తెచ్చి పోలీసులు ఇరికించారని ఆమె ఆరోపించారు. ఈ నేపధ్యంలో హైకోర్టు తీర్పు పోలీసులకు షాకిచ్చింది.
 
మరోవైపు ఆయేషా హత్య కేసులో ఆధారాలు లేకుండా ఓ అమాయకుడిని 8 ఏళ్లపాటు జైల్లో వుంచడంతో అతడు మానసికంగా క్రుంగిపోయినట్లు అప్పట్లో మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఇప్పుడు అతడు నిర్దోషి అని తేలడంతో నాశనమైన అతడి జీవితాన్ని పోలీసులు బాగు చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం