Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో శ్రీవారి భక్తులను నిలువునా దోచేస్తున్న ఆటోడ్రైవర్లు..

తిరుపతిలో శ్రీవారి భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఒక ప్రాంతం నుంచే మరో ప్రాంతానికి వెళ్ళేందుకు భక్తులు ఆటోలను

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (10:54 IST)
తిరుపతిలో శ్రీవారి భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఒక ప్రాంతం నుంచే మరో ప్రాంతానికి వెళ్ళేందుకు భక్తులు ఆటోలను ఆశ్రయిస్తుంటే వారు భక్తుల వద్ద అధి కమొత్తంలో డబ్బులను వసూలు చేసేస్తున్నారు. తిరుపతిలో ఆటోడ్రైవర్ల ఆగడాలపై ప్రత్యేక కథనం.
 
తిరుపతి.. ప్రపంచంలోనే పేరెన్నిగల ఆధ్మాత్మిక క్షేత్రం. తిరుపతికి ప్రతిరోజు 50 నుంచి 60వేల మంది భక్తులు వస్తూ పోతుంటారు. అందులో బస్సులు, రైళ్ళ ద్వారా వచ్చే ప్రయాణీకుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. తిరుపతికి వచ్చే భక్తులు స్థానికంగా ఉన్న తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, గోవిందరాజస్వామి ఆలయంలకు వెళ్ళడానికి ఆటోలను ఆశ్రయిస్తుంటారు. 
 
అయితే స్థానిక ఆలయాలకు కిలోమీటర్లను బట్టి డబ్బులు వసూలు చేయాలి. అయితే తిరుపతిలో ఆటో డ్రైవర్లు మాత్రం భక్తులను నిలువునూ దోచేస్తున్నారు. మామూలుగా తీసుకోవాల్సిన దానికన్నా పదిరెట్లు అధికంగా తీసుకుని భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
 
తిరుపతి నుంచి తిరుచానూరుకు 7 కిలోమీటర్ల దూరం ఉంది. మామూలుగా అయితే 50 నుంచి 70 రూపాయల్లోగా ఆటోడ్రైవర్లు తీసుకోవాలి. కానీ 300 నుంచి 400 రూపాయల వరకు భక్తుల వద్ద వసూలు చేస్తున్నారు. అంతేకాదు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్ళడానికి 120 నుంచి 150 రూపాయలు తీసుకోవాలి. 
 
కానీ 500 నుంచి 600 రూపాయలను ఆటోడ్రైవర్లు వసూలు చేసేస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయం రైల్వేస్టేషన్‌కు అతిసమీపంలో ఉంది. అయితే కొంతమంది భక్తులకు ఆలయం తెలియకపోవడంతో ఆటోడ్రైవర్లు సులువుగా వారిని మోసం చేసేస్తున్నారు. పక్కనే ఉన్న రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి పట్టణంలోని నాలుగు ఐయిదు వీధులను తిప్పుతూ తిరిగి ఆలయం వెనుక భాగం నుంచి భక్తులను తీసుకొచ్చి విడిచిపెట్టి 200 రూపాయలకుపైగా వసూలు చేసేస్తున్నారు.
 
ఆటోడ్రైవర్ల ఆగడాలను అదుపుచేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు మామూళ్ళ మత్తులో తూగుతుండటంతో ఇక అడిగే నాథుడే కరువయ్యాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆటోడ్రైవర్ల ఆగడాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా భక్తులను నిలువుదోపిడీ నుంచి రక్షించాలని కోరుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments