ఆటో డ్రైవర్ లైంగిక దాడి.. ప్రతిఘటించిన అక్కాచెల్లెళ్లు.. కానీ ఇనుప్ రాడ్‌తో?

క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మహిళలపై వేధింపులకు దిగుతున్నారు. మొన్నటికి మొన్న క్యాబ్‌లో ఎక్కిన మహిళను వేధించిన కారు డ్రైవర్ అరెస్టయ్యాడు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కిన యువతిపై లైంగిక దాడికి యత్

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (17:00 IST)
క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మహిళలపై వేధింపులకు దిగుతున్నారు. మొన్నటికి మొన్న క్యాబ్‌లో ఎక్కిన మహిళను వేధించిన కారు డ్రైవర్ అరెస్టయ్యాడు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కిన యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన విజయనగరంలోని బొబ్బిలి, కోమటిపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వివాహిత స్వాతి తన సోదరి పావనితో కలిసి బొబ్బిలి పట్టణానికి షాపింగ్‌కి వచ్చారు. అనంత‌రం చర్చి సెంటర్‌కి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ నరేష్‌ (35) జగన్నాథపురంలోకి ఆటో రాగానే స్వాతిపై లైంగిక దాడి చేయబోయాడు. 
 
అయితే అక్కాచెల్లళ్లు తీవ్రంగా ప్రతిఘటించారు. అంతే ఇక వారిని చంపేందుకు ఆటోడ్రైవర్ ప్రయత్నించాడు. వారిని ఇనుప రాడ్‌తో బాదాడు. ఆపై ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకునేందుకు అక్కాచెల్లెళ్లు ఆటో నుంచి దూకేశారు. ఈ ఘటనలో స్వాతి కోమాలోకి వెళ్లిపోగా, పావని స్వల్ప గాయాలకు గురైంది.

ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ నరేష్‌పై పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఇక గాయపడిన అక్కాచెల్లెళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం