Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో దారుణం - ప్రేమించలేదని స్కూటర్‌తో ఢీకొట్టి యువతి నడుము విరగ్గొట్టిన యువకుడు

తిరుపతిలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఒక యువకుడు స్కూటర్‌పై వెళుతున్న యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా స్కూటర్‌పై యువతి వెళుతుండగా మరో స్కూటర్‌పై వెళ్ళి వేగంగా ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన యువతిని తిరిగి కొట్టేందుకు ప్రయ

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (12:58 IST)
తిరుపతిలో దారుణం జరిగింది. తనను  ప్రేమించలేదన్న కోపంతో ఒక యువకుడు స్కూటర్‌పై వెళుతున్న యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా స్కూటర్‌పై యువతి వెళుతుండగా మరో స్కూటర్‌పై వెళ్ళి వేగంగా ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన యువతిని తిరిగి కొట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. 
 
తిరుపతి కనకభూషణం లేఅవుట్‌లో నివశిస్తున్న ఒక యువతిని తనను ప్రేమించాలంటూ కడప జిల్లా చిట్వేల్‌కు చెందిన నవీన్‌ కుమార్‌ వేధించేవాడు. ప్రేమించేందుకు యువతి నిరాకరించింది. అంతకుముందు ఒకేచోట చదువుకున్నామన్న కారణంతో అతను వేధింపులను ఆ యువతి ఇంట్లో చెప్పలేదు. దీంతో ఈ నెల 2వ తేదీ ద్విచక్రవాహనంపై వెళుతున్న యువతిని మరో ద్విచక్రవాహనంతో నవీన్‌, తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఢీకొట్టాడు. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. మొదట్లో పోలీసులు యాక్సిడెంట్‌గా కేసు నమోదు చేశారు. 
 
అయితే యువతి కోలుకున్న తర్వాత జరిగిన విషయమంతా చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. అయినా సరే పోలీసులు కేసు నమోదు చేయలేదు. విషయం తెలుసుకున్న మహిళా సంఘం నాయకులు జిల్లా ఎస్పీ జయలక్ష్మి దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఎస్పీ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. 
 
తనపై కేసు నమోదైందని తెలిసిన నవీన్‌కుమార్‌ వెంటనే బెయిల్‌ కూడా పొందాడు. ఇద్దరిపైనా నిర్భయ చట్టంపై కేసులు నమోదు చేశారు. రెండవ నిందితుడు యశ్వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌ కుమార్‌ను కూడా అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అతడు ఓ పార్టీకి చెందినవాడని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు. అందువల్లనే పోలీసులు అతడిని వదిలేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments