కులం పిచ్చి.. కన్నకూతురిపై రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (14:18 IST)
కులం పిచ్చితో క‌న్న పేగుబంధాన్ని బ‌లితీసుకుంటున్నారు. కులాంతర వివాహం కారణంగా తండ్రి రోక‌లి బండ‌తో కుమార్తె త‌ల‌పై మోదీ హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. పెద్ద‌ప‌ప్పూరు మండ‌లం చెర్లోప‌ల్లి గ్రామంలో స్వాతి(18) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. 
 
ఇంట‌ర్ త‌ప్ప‌డంతో చ‌దువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. స్వాతి ఇటీవ‌ల ఓ అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌యం ఇంట్లో తెలిసింది. ఆ అబ్బాయి ది వేరే కులం కావ‌డంతో స్వాతి తండ్రి గుర్ర‌ప్ప వీరి ప్రేమ‌ను వ్య‌తిరేకించాడు. దీంతో ఈ విష‌య‌మై స్వాతి, గుర్ర‌ప్పకు మధ్య ప‌లు మార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. 
 
ఈ క్ర‌మంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మ‌రోసారి ఈ విష‌యమై వాగ్వాదం జ‌రిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన గుర్ర‌ప్ప ప‌క్క‌నే ఉన్న రోక‌లి బండ‌తో స్వాతి త‌ల‌పై గ‌ట్టిగా కొట్ట‌డంతో.. అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. 
 
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స్వాతి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments