Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి ప‌న్నుపై నిర‌స‌న, సీపీఎం,సిపిఐ నేత‌ల అరెస్ట్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:11 IST)
విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను కు వ్యతిరేకం గా
విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సీపీఎం,సిపిఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ఆందోళన చేశారు.

వారంద‌రినీ పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. క‌మ్మూనిస్టు నాయ‌కుల్ని ఎత్తి మ‌రీ వ్యానుల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. మోడీ- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్, పాలక పక్షం బాధ్య‌త వ‌హించాల‌ని సీపీఎం నాయ‌కుడు సి.హెచ్. బాబూరావు అన్నారు.

ఆస్తి ప‌న్నుపై రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే, చరిత్ర హీనులుగా మిగిలిపోతార‌ని హెచ్చ‌రించారు. ప్రజాక్షేత్రంలో ఆందోళన ఉదృతమవుతోంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ధ‌ర్నా చేసిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణా, డి. కాశీ నాథ్, సిపిఐ నేతలు శంకర్, కోటేశ్వరరావుతోపాటు 70 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments