కరోనా కష్టకాలంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై పిడుగు

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:15 IST)
కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీలో పని చేసే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై పిడుగుపడింది. కరోనా వైరస్‌ మహమ్మారిని అడ్డుపెట్టుకుని ఏకంగా 600 మంది సిబ్బందిని అధికారులు తొలగించారు. వీరంతా కృష్ణా రీజియన్‌లో ఉండే 14 డిపోలకు చెందిన సిబ్బంది కావడం గమనార్హం. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన యజమాన్యం ఇపుడు అర్థాంతరంగా బయటకు గెంటేస్తే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. 
 
నిజానికి కృష్ణా జిల్లా రీజియన్‌లోని ఆర్టీసీ గ్యారేజీల్లో ఎక్కువ మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. అందుకే ఆర్టీసీ యాజమాన్యం దృష్టి ఈ రీజియన్‌‌పై పడింది. గ్యారేజీల్లో సగటున 40 మంది చొప్పున కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటువేసింది. 
 
ఈ రీజియన్‌లో 14 డిపోలు ఉన్నాయి. విజయవాడ, జగ్గయ్యపేట, అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, గుడివాడ, మచిలీపట్నం, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, గవర్నర్‌ పేట-1, 2, ఆటోనగర్‌, గన్నవరం, ఉయ్యూరు బస్‌ డిపోల పరిధిలోని 600 మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆర్టీసీ అధికారులు తొలగించారు. ఆఫీసుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిపైనా ఆర్టీసీ అధికారులు వేటు వేశారు. 
 
దీంతో వీరంతా లబోదిబోమంటున్నారు. అసలే కరోనా దెబ్బకు ఆర్నెల్లుగా ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉంటే.. ఇపుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తమను మరింతగా కుంగదీసిందని వారు వాపోతున్నారు. ఇపుడు భార్యా పిల్లలను ఎలా పోషించుకోవాలని వారు విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments