Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ ఆర్టీసీలో వాట్సాప్ టిక్కెట్లకు అనుమతి... ఆదేశాలు జారీ

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ యంత్రాంగం కూడా సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులోభాగంగా, టిక్కెట్ల జారీని ఆన్‌లైన్, వాట్సాప్‌లలో కూడా జారీ చేస్తుంది. అయితే, కొందరు కండక్టర్లు వాట్సాప్‌లో వచ్చే టిక్కెట్లను అనుమతించడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు కీలక ఆదేశాలు జారీచేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్‌ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్‌ టికెట్లను.. వాట్సప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్‌ సర్వీసులు అన్నింటా వాట్సప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. 
 
మరోవైపు. వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు ప్రయాణ టిక్కెట్‌ను ఎలా బుకింగ్ చేసుకోవాలో కూడా ఒక డెమోను రిలీజ్ చేసింది. తొలుత 9552300009 నంబరుకు తొలుత హాయ్‌ అని మెసేజ్‌ పంపాలి. ఆ తర్వాత ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌/రద్దు అనేది ఎంపిక చేసుకోవాలి. 
 
అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్‌ చేస్తే.. ఏయే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకొని ఆన్‌లైన్, డిజిటల్‌ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్‌ చేసుకున్న వ్యక్తి వాట్సప్‌ నంబరుకు టికెట్‌ వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments