Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (22:53 IST)
ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ కారణంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మరికొన్ని చోట్ల చెదురుముదురుగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ఏపీఎస్డీఎంఏ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడరాదని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక  చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రఖర్  జైన్ భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments