Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేదని, కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించవలసి ఉంటుందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)ని సంప్రదించడం అత్యవసరమని సూచించింది.
 
బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే, 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలపై కేంద్రం అధ్యయనం చేయాలని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు పొందాలని, పర్యావరణంపై ప్రభావం అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతి ఇవ్వడానికి వీలవుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. 
 
మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు 
 
తనకు పరిచయం ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆర్ఎంపీ వైద్యుడు మహేశ్.. గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామంలో గత ఆరేళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత(35) మిర్యాలగూడలో భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం స్వగ్రామం వెళ్లే నిమిత్తం ఆమె మిర్యాలగూడలో బస్సెక్కి మల్లేపల్లికి వచ్చారు. జూనూతుల వెళ్లే బస్సు కోసం అక్కడి బస్టాపులో ఎదురు చూస్తున్నారు. 
 
ఇంతలో అక్కడకు కారులో వచ్చిన మహేశ్.. పూర్వపరిచయం ఉన్న ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జూనూతుల వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెకు మత్తు మందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. 
 
అది సేవించిన ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కారును నల్గొండకు తీసుకెళ్లాడు. రాత్రి 12 గంటల వరకూ అక్కడే ఉన్నాడు. తర్వాత జూనూతుల తిరుగుప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఆమెను హతమార్చే ఉద్దేశంతో రెండు చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేశాడు. 
 
ఈ క్రమంలో గుర్రంపోడులో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు అర్థరాత్రి దేవరకొండ వైపు వెళ్తున్న కారును గమనించారు. గొర్రెల దొంగలై ఉండొచ్చనే అనుమానంతో వెంబడించారు. జూనూతులు స్టేజీ దాటిన తర్వాత కాచారం స్టేజీ వైపు మలుపు తిరిగిన తర్వాత కారు డ్రైవర్ లైట్లు ఆర్పివేసినట్టు గమనించిన పోలీసులు.. అటు వైపు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి కారులో నుంచి ఓ మహిళను కిందకు తోసేసినట్టు గుర్తించారు. 
 
అప్పటికే ఆ మహిళ నోటివెంట నురగలు వస్తుండటంతో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మహేశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments