Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనాథ్‌కి దాదా సాహెబ్ పురస్కారంపై స్పీకర్ కోడెల హర్షం

విజయవాడ : కళాతపస్వి కె.విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అనేక సినిమాలు తీసిన విశ్వనాథ్‌కు ఈ పురస్కారం దక్కడం.. తెలుగువారికి దక్క

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (21:20 IST)
విజయవాడ : కళాతపస్వి కె.విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అనేక సినిమాలు తీసిన విశ్వనాథ్‌కు ఈ పురస్కారం దక్కడం.. తెలుగువారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. 
 
మన సంప్రదాయాలు, సంగీతం, నాట్యం వంటి కళల్ని కథాంశంగా తీసుకుని అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్.. గుంటూరు జిల్లా పెదపులివర్రుకు చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమన్నారు. ఆయన తీసిన సినిమాలు చూసి.. కళలపై మక్కువ పెంచుకుని.. ఎంతోమంది సంగీతం, నాట్యం నేర్చుకున్న వాళ్లు ఉన్నారని స్పీకర్ కోడెల అన్నారు. 
 
ఎక్కడా హద్దులు దాటని సాహిత్యం, మనసుకు హాయి అనిపించే సంగీతంతో ఆయన తీసిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. నటనలో సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆయన చిత్రాలంటే తనకెంతో ఇష్టమని స్పీకర్ కోడెల పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments