ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (15:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఈ నెల 5వ తేదీన స్కూల్స్‌ను మూసివేతకు అఖిల భారత విద్యార్థి సంస్థ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహిస్తున్నామని ఏబీవీపీ ప్రతినిధులు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడ టీచర్ల నియామకం చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. వీటితో పాటు మరికొన్ని డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. 
 
ఇటీవలి కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు పిల్లల చదువులు మరింత భారంగా మారాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం అంటూ భారీ స్థాయిలో వసూళ్ళకు పాల్పడుతూ మోయలేని భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. 
 
పైగా, ఫీజుల వసూలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ ఒకటిని కూడా ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఒక్క ఫీజులు మాత్రమే కాకుండా డొనేషన్, కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments