Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (14:50 IST)
అదానీ గ్రూపుతో గత వైకాపా ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె లేఖ రాశారు. అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని కోరారు. పారిశ్రామికవేత్త అదానీ నుంచి జగన్‌కు అందిన ముడుపులు, అర్థరాత్రి అనుమతులపై దర్యాప్తు జరపాలని ఆమె కోరారు. అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్రంపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఆమె రాసిన బహిరంగ లేఖలో ఈ ఒప్పందాల్లో గౌతమ్ ఆదానీ నుంచి జగన్ రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆర్థికంగా నష్టాల్లోకి, కష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. 
 
అదానీ, జగన్ మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్ర సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా పీసీసీ భావిస్తోందన్నారు. సెకీ ద్వారా అదానీతో గత ప్రభుత్వం 25 ఏళ్లకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి భారమన్నారు. ఆదానీతో ఒప్పందాల రద్దుతో పాటు ఆ కంపెనీని తక్షణమే బ్లాక్లెస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టు అమ్మకంపైనా విచారణ చేపట్టాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments