చెత్త ఎత్తేకొద్దీ కరెన్సీ నోట్ల కట్టలు ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చెత్త కుండీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 
 
తాడేపల్లిలో పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఉండవల్లి సెంటరులోని ఎస్బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. 
 
ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు.. వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. 
 
కానీ, కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఆ ‘పిల్లల నోట్ల’ కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments