Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత పార్టీ నేతలకే వైకాపా హెచ్చరికలు... కౌలు కట్ చేస్తామంటూ బెదిరింపులు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (08:18 IST)
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా నేతలు చేస్తున్న బెదిరింపులు నానాటికీ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులనే కాదు.. చివరకు సొంత పార్టీ నేతలను సైతం వారు హెచ్చరిస్తున్నారు. బెదిరింపులతో సరిపెట్టుకోని నేతలు.. పలు ప్రాంతాల్లో దాడులకు సైతం దిగుతున్నారు. అంతటితో ఆగని నేతలు.. వారి నోటి దగ్గర కూడు కూడా లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. 
 
సాక్షాత్ ఏపీ హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గంలో సొంత పార్టీ వారికే  రక్షణ లేకుండా పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల వైసీపీ రెబల్‌గా నామినేషన్‌ వేయడానికి వెళుతున్న వారిపై దాడి చేసిన విషయం విదితమే. 
 
ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్‌ వేసిన రెబల్‌ వర్గంపై ఇప్పుడు బెదిరింపుల పర్వంప్రారంభమైంది. ఈ వర్గంలో ఎక్కువ శాతం పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం పొలాలకు వెళ్లే నీటి పైపులను పగల గొట్టడమే కాకుండా నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటేనే పంటకు నీరిచ్చేది అంటూ బెదిరించారు. 
 
పొలాల్లో ట్యూబులు, ఇంజన్లు పగలగొడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వచ్చేసరికి వారంతా పరారయ్యారు. బాధితులు గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ ప్రశాంతితో పాటు స్థానిక పోలీసుల వద్ద తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలు కూడా ఇవ్వమంటున్నారని, మా నోటి వద్ద కూడు లేకుండా చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశంపై పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments