Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిగానే మ‌ళ్ళీ అసెంబ్లీ కి వస్తా... చంద్రబాబు కంట త‌డి!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (12:57 IST)
ఇది గౌర‌వ స‌భా... కౌర‌వ స‌భా... వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి దూషిస్తారా?  చివ‌రికి కుటుంబ స‌భ్యుల‌పైనా దూష‌న‌లు చేస్తారా అంటూ, ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. చంద్రబాబు సతీమణిని వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శలు చేసిన వైసీపీ సభ్యుల‌పై ఆయ‌న అస‌హ‌నంగా స్పందించారు. మళ్ళీ గెలిచిన తర్వాతే శాస‌న సభకు వస్తా అంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. 

 
అంత‌కు ముందు అత్యవసర టీడీఎల్పీ సమావేశంలో చంద్ర‌బాబు కంట తడిపెట్టారు. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయటంపై చంద్రబాబు ఆవేదన వ్య‌క్తం చేశారు. తాను మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతాన‌ని, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ కి వస్తాన‌ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ‌ప‌థం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ఘాంత‌పోయారు. 

 
చంద్ర‌బాబు చేసిన లుచ్చా ప‌నులు అని మంత్రి కొడాలి నాని మాట్లాడ‌ట‌మే ఆయ‌న‌ను తొలుత మ‌న‌సుకు బాధ క‌లిగించింది. దీనికి తోడు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపైనా ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు వ్య‌క్తిగ‌తంగా కామెంట్స్ చేయ‌డంతో ఆయ‌న పూర్తిగా చ‌లించిపోయారు. మళ్ళీ గెలిచిన తర్వాతే సభ కు వస్తా అని చంద్రబాబు సవాల్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments