Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.120 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన ఏపీ ఎన్జీవో

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఏపీ ఎన్జీవో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించింది. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకుని రూ.120 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో నేతలను అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 
మరోవైపు, విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పోటు పెరుగుతుంది. మంగళవారం బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఇది బుధవారానికి మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 8 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరిందని, ఇప్పటికీ ఒక గండి పూడ్చినట్టు తెలిపారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయని, ఈ పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని  తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments