ఎన్నికలంటే వరుస వివాహాలు కాదు : పవన్‌కు ఎమ్మెల్యే కౌంటర్

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (17:12 IST)
ఎన్నికలంటే వరుస వివాహాలు కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైకాపా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో వరుసగా విడాకులు తీసుకుంటూ ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదన్నారు.
 
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. రాజకీయాలకు సిద్ధాంతాలు, విలువలే ప్రాతిపదిక అని చెప్పుకొచ్చారు.
 
నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులను మోసం చేసిన పవన్... ఆపై టీడీపీతో కలిసినా, ఆ పార్టీ నుంచి కూడా విడిపోయారని వెల్లడించారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన పవన్ కిందిస్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. 
 
పవన్ కల్యాణ్, చంద్రబాబుల నీచ రాజకీయాలను ప్రజలు గుర్తించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ  పవన్ కల్యాణ్ పోటీ చేయగా, ఆయనపై గ్రంథి శ్రీనివాస్ విజయంసాధించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments