Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీటెండరింగ్‌ ద్వారానే పోలవరం పనులు : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (16:26 IST)
పోలవరం పనులను రీటెండరింగ్‌ ద్వారానే కొనసాగిస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని అన్నారు. అనుకున్న సమయంలోనే ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన జల జీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి ఇచ్చే యోచనలో రాష్ట్రప్రభుత్వం లేదని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ నిరందించాలనే సంకల్పాన్ని కేంద్రమంత్రి వివరించారని, దీనిపై సెప్టెంబరులో టెండ్లర్లు పిలవబోతున్నామని తెలిపారు. త్వరితగతిన ప్రతి ఇంటికి నీరందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని లేదని తేల్చి చెప్పారు. అదేసమయంలో రివర్స్ టెండరింగ్ ద్వారానే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తామని తెలిపారు. వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని చెప్పారు.
 
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చే ప్రాజెక్టును చేపట్టబోతున్నామని... రూ. 60 వేల కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ. 30 వేల కోట్ల సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments