Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (15:48 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులకు పాల్పడిన వైకాపా నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైకాపా నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ధ్వజమెత్తారు. జగన్ తన తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని ఆమె మండిపడ్డారు. 
 
జగన్ పర్యటనకు వ్యతిరేకంగా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైకాపా సైకోల దాడిని ఖండించారు. మహిళలు, పోలీసులపై రాళ్లదాడి చేసిన దుర్మార్గులకు కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలిలో గాంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
 
ఇపుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ధ్వజమెత్తారు. సొంత చెల్లి పుట్టుకపై సైతం దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశలేనని చెప్పారు. మహిళపై వైకాపా నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారాల లోకేశ్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments