నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను సురక్షితంగా తరలిస్తాం : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
గురువారం, 11 సెప్టెంబరు 2025 (10:58 IST)
నేపాల్ దేశం అంతర్గత ఘర్షణలతో అట్టుడుకిపోతోంది. దీంతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. జెన్-జడ్ ఉద్యమం నేపాల్‌ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో అనేక మంది తెలుగు ప్రజలు చిక్కుకునివున్నారు. వీరిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవతో అధికారులు చర్యలు చేపట్టారు. నేపాల్‌ నుంచి పలువురు యాత్రికులు కాసేపట్లో రాష్ట్రానికి బయల్దేరనున్నారు. సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. 
 
అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకోనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments